Friday, June 04, 2010

Annamayya Keerthanalu - తిరువీథుల మెఱసీ దేవదేవుడు (Tiruveedhula Merasee DevaDevudu in Telugu)

తిరువీథుల మెఱసీ దేవదేవుడు
గరిమల మించిన సింగారములతోడను

తిరుదండేలపై నేగీ దేవుడిదె తొలునాడు
సిరుల రెండవనాడు శేషునిమీద
మురిపేన మూడోనాడు ముత్యాల పందిరి క్రింద
పొరినాలుగోనాడు పువు గోవిలలోను

గ్రక్కున నైదవనాడు గరుడునిమీద
యెక్కను ఆరవనాడు యేనుగుమీద
చొక్కమై యేడవనాడు సూర్యప్రభలోనను
యిక్కువ దేరును హుఱ్ఱ మెనిమిదోనాడు


కనకపుటందలము కదిపి తొమ్మిదోనాడు
పెనచి పదోనాడు పెండ్లిపీట
యెనసి శ్రీ వేంకటేశు డింతి యలమేల్‍మంగతో
వనితల నడుమను వాహనాలమీదను

No comments: